Share News

తాగునీళ్లివ్వలేని ప్రభుత్వం

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:38 PM

ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు.

తాగునీళ్లివ్వలేని ప్రభుత్వం
ఆలూరు-బళ్లారి ప్రధాన రహదారిలో ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే విరుపాక్షి, మహిళలు

ఎమ్మెల్యే విరుపాక్షి

మహిళలలో కలిసి రహదారిపై నిరసన

ఆలూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. మంగళవారం ఆలూరులోని అంబేడ్కర్‌ కూడలిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో గంటపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నెలలు గడుస్తున్నా కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లికార్జున, గిరి, వెంకటేశ్వర్లు, భాస్కర్‌, షఫీఉల్లా, జాన్‌, మేరీ, తిక్కస్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:38 PM