సమగ్ర విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:12 AM
మెగా డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదనతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి డీఎస్సీ 2025 నియామకాల్లో భారీ ఆవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంతోమందికి అర్హత ఉన్నా ఉద్యోగాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థుల సందేహాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు వైఎ్‌సఆర్‌సీపీ ప్రజాస్వామ్య పద్ధతితో పోరాటం కొనసాగిస్తామన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎ్‌సఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఫయాజ్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, నగరూరు చంద్ర, పట్టణ అధ్యక్షుడు దేవా, ఉలిద్ర ఏసేబు, చిరంజీవి, నారాయణ, యాసిన, శ్రీలక్ష్మీ, మంజుల, సోను, లక్ష్మీ, దేవదాస్ పాల్గొన్నారు.
నారా లోకేశ మంత్రి పదవికి రాజీనామా చేయాలి
పత్తికొండ టౌన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచార ణ జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 6నుంచి 9వరకు నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేప ట్టనున్నట్లు తెలిపారు. 10న పత్తికొండ పట్టణంలో భారీ ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పా ల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ నా యకులు శ్రీరంగడు, బాబుల్‌రెడ్డి, సోమశేఖర్, ఎంపీపీ నారాయణదాస్, కొమ్ము నెట్టేకల్, నాగరాజు, బనగాని శీను, నూర్‌బాషా పాల్గొన్నారు.