Share News

రెండున్నర గంటల్లోనే 99.75శాతం రైతుల ఖాతాల్లో జమ

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:01 AM

‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత సొమ్ము .. ముఖ్యమంత్రి విడుదల చేసిన రెండున్నర గంటల వ్యవధిలోనే 99.75శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమయింది.

రెండున్నర గంటల్లోనే 99.75శాతం రైతుల ఖాతాల్లో జమ

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత సొమ్ము .. ముఖ్యమంత్రి విడుదల చేసిన రెండున్నర గంటల వ్యవధిలోనే 99.75శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమయింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన సూరంపల్లిలో 46,85,838 మంది రైతులకు రూ.2,675.97 కోట్లు విడుదల చేయగా.. రాత్రి 9 గంటల సమయానికి 46,74,577 మంది (99.75ు) ఖాతాల్లో డబ్బులు పడినట్లు సమాచారం అందిందని వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌ శ్రీనివాసులు వెల్లడించారు. కేవలం 11,261 మంది రైతుల ఖాతాల్లో వివిధ సాంకేతిక కారణాలతో కేవలం రూ.6.84 కోట్లు జమ కాలేదని చెప్పారు. ఈ విడత ఒక్కో రైతుకు రాష్ట్ర వాటా రూ.4 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు కలిపి రూ.6వేలు చొప్పున జమయ్యాయి. మొత్తం చెల్లింపుల్లో రాష్ట్రవాటా రూ.1,874 కోట్లు, కేంద్ర వాటా రూ.802 కోట్లు ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుభరోసా నిధులు విడుదల చేసిన ప్రతిసారీ.. రోజుల తరబడి ఖాతాల్లో డబ్బు జమకాక.. రైతులు మెసేజ్‌ల కోసం ఎదురుచూసిన పరిస్థితులున్నాయి.

Updated Date - Mar 14 , 2026 | 05:01 AM