ఏడాదైనా రిలీవ్ చేయరా?
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:33 AM
గతేడాది వేసవిలో బదిలీ అయినా ఇప్పటికీ అక్కడి నుంచి రిలీవ్‌కాని టీచర్ల పరిస్థితి ఏంటని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించింది.
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గతేడాది వేసవిలో బదిలీ అయినా ఇప్పటికీ అక్కడి నుంచి రిలీవ్‌కాని టీచర్ల పరిస్థితి ఏంటని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించింది. ఏడాది దాటినా ఇంకా రిలీవ్ చేయరా? అని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఇంతకాలమైనా రిలీవ్ చేయకపోవడంతో 950 మంది టీచర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వారి పిల్లల చదువులు, నివాసం గందరగోళంగా మారాయని ఇప్పటికైనా వారిని రిలీవ్ చేయాలని గురువారం ఓ ప్రకటనలో వారు డిమాండ్ చేశారు.