Share News

‘ఈ-శ్రమ్‌’లో 88.16 లక్షల మంది కార్మికులు

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:19 AM

రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్‌లో రూ.18,24,221 మంది నమోదయ్యారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ తెలిపారు

‘ఈ-శ్రమ్‌’లో 88.16 లక్షల మంది కార్మికులు

  • త్వరలో ప్రసూతి, వివాహ కానుకలు అమలు: మంత్రి సుభాశ్‌

రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్‌లో రూ.18,24,221 మంది నమోదయ్యారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అవ్యవస్థీకృత రంగ కార్మికుల సంక్షేమంపై ఎమ్మెల్యేలు డాక్టర్‌ పార్థసారధి, మాధవీ రెడ్డి, లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివా్‌స అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో ‘ఈ-శ్రమ్‌’లో 88.16 లక్షల మంది కార్మికులు నమోదయ్యారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే కార్మికుల కోసం పథకాలను పునరుద్ధరించామన్నారు. ప్రసూతి సహాయం, వివాహ కానుక, మరణ, అంత్యక్రియల సహాయాన్ని అందించాలని నిర్ణయించామని తెలిపారు. న్యూ లేబర్‌ కోడ్‌ల ద్వారా చివరికి జర్నీ అలవెన్సులు కూడా అందిస్తున్నామని చెప్పారు.

Updated Date - Feb 24 , 2026 | 05:19 AM