క్రీడలకు కూటమి తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:15 AM
కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత ఈ రెండేళ్లలో క్రీడలు, యువజన సేవల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
రెండేళ్లలో 819 మందికి ఉద్యోగాలు: మంత్రి రాంప్రసాద్
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత ఈ రెండేళ్లలో క్రీడలు, యువజన సేవల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన క్రీడాశాఖలో సాధించిన రెండేళ్ల వృద్ధిపై మా ట్లాడారు. గత వైసీపీ హయాంలో నిర్వీర్యమైన క్రీడా వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, క్రీడాకారులకు ప్రో త్సాహం, యువత సాధికారత లక్ష్యంగా ప్రభు త్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. విజయనగరంలో విజ్జి స్టేడియం, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద రూ.75 కోట్లతో విజయవాడ, కుప్పం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, గుంటూరుల్లో ఆధునిక క్రీడా మౌలిక వసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.5.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించగా, వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 429 మందికి రూ.19 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్లు చెప్పారు. క్రీడా రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచడంతో రెండు సంవత్సరాల్లో 819 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై 593 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.