8 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా బలోపేతం
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:10 AM
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు సుమారు రూ. 8 వేల కోట్లుతో వివిధ ప్రాజెక్టులను చేపట్టినట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు.
ట్రాన్స్‌కో ప్రాజెక్టుల పనులపై విజయానంద్ సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు సుమారు రూ. 8 వేల కోట్లుతో వివిధ ప్రాజెక్టులను చేపట్టినట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయానంద్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలో మరో రూ.3 వేల కోట్ల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.