Share News

8 పాఠశాలలకు ‘స్వచ్ఛ్‌ విద్యాలయ’ అవార్డులు

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:14 AM

రాష్ట్రంలోని ఎనిమిది పాఠశాలలు ‘స్వచ్ఛ్‌ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌-2025’లో అవార్డులకు ఎంపికయ్యాయి.

8 పాఠశాలలకు ‘స్వచ్ఛ్‌ విద్యాలయ’ అవార్డులు

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎనిమిది పాఠశాలలు ‘స్వచ్ఛ్‌ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌-2025’లో అవార్డులకు ఎంపికయ్యాయి. సురక్షిత నీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్ష ప్రామాణికంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఏలూరు జిల్లా తడికలపూడి జడ్పీ ఉన్నత పాఠశాల, శ్రీకాకుళం జిల్లా హిరమండలం కేజీబీవీ, పశ్చిమగోదావరి జిల్లా స్టీమర్‌ రోడ్‌ మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌, విజయనగరం జిల్లా మలిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం జిల్లా ఆనందపురం కేజీబీవీ, అనకాపల్లి జిల్లా లింగంపేట ఎంపీ ప్రాథమిక పాఠశాల, శ్రీకాకుళం జిల్లా జలుమూరు ఎంపీ ప్రాథమిక పాఠశాల, గుంటూరు జిల్లాలో పొన్నూరు నాట్కో స్కూల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, మరో ప్రైవేటు పాఠశాల ఈ అవార్డులకు ఎంపికయ్యాయి.

Updated Date - Jun 17 , 2026 | 05:15 AM