Share News

ఆర్టీసీకి 750 కొత్త బస్సులు: మంత్రి రాంప్రసాద్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:30 AM

‘పీఎం ఈ-బస్‌ సేవ’ ద్వారా రాష్ట్రానికి 750 కొత్త బస్సులు రానున్నాయని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఆర్టీసీకి 750 కొత్త బస్సులు: మంత్రి రాంప్రసాద్‌

ఇంటర్నెట్ డెస్క్: ‘పీఎం ఈ-బస్‌ సేవ’ ద్వారా రాష్ట్రానికి 750 కొత్త బస్సులు రానున్నాయని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ‘స్త్రీశక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 65 శాతం పెరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ.47 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని తాజాగా రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Updated Date - Feb 26 , 2026 | 04:30 AM