Share News

ఉపాధి మెటీరియల్‌ నిధులు రూ.740 కోట్లు విడుదల

ABN , Publish Date - Jan 28 , 2026 | 05:11 AM

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులు మరో రూ.740 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయి.

ఉపాధి మెటీరియల్‌ నిధులు రూ.740 కోట్లు విడుదల

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులు మరో రూ.740 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి నాలుగో విడతలో తొలిగా రూ.480 కోట్లు, పాత బకాయిలు మరో రూ.75 కోట్లు కలిపి కేంద్ర వాటాగా సుమారు రూ.556 కోట్లు స్పర్శ అకౌంట్‌ ద్వారా విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన 25 శాతం వాటాగా మరో రూ.185 కోట్లు జమచేస్తే మొత్తం రూ.740 కోట్లు మెటీరియల్‌ నిధులు రాష్ట్రానికి అందినట్లయింది. దీంతో అక్టోబరు వరకూ ఉపాధి పథకంలో మెటీరియల్‌ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీనివల్ల పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.

Updated Date - Jan 28 , 2026 | 05:13 AM