Share News

పంచాయతీరాజ్‌లో పదోన్నతుల పండుగ

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:04 AM

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పదోన్నతుల పండుగ వచ్చింది. 74 మంది డీపీఓ, డీడీఓ, డిప్యూటీ సీఈఓలకు జడ్పీ సీఈఓలుగా పదోన్నతులు కల్పిస్తూ...

పంచాయతీరాజ్‌లో పదోన్నతుల పండుగ

  • జడ్పీ సీఈఓలుగా 74 మందికి పదోన్నతి

  • డీడీఓ, డీపీఓ, డిప్యూటీ సీఈఓలకు అవకాశం

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పదోన్నతుల పండుగ వచ్చింది. 74 మంది డీపీఓ, డీడీఓ, డిప్యూటీ సీఈఓలకు జడ్పీ సీఈఓలుగా పదోన్నతులు కల్పిస్తూ ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌ చరిత్రలో ఈ పదోన్నతులు ఒక మైలురాయిగా నిలిచాయి. ఈ శాఖ ప్రారంభమైనప్పటి నుంచి ఇతర శాఖల అధికారులే జడ్పీ సీఈఓలుగా విధులు నిర్వహిస్తుండగా, తొలిసారి 74 మంది పంచాయతీరాజ్‌ అధికారులకు జడ్పీ సీఈఓ హోదా కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ పదోన్నతులకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల సంఘం నేతలు కేఎస్‌ వరప్రసాద్‌, కేఎన్‌వీ ప్రసాద్‌, డి.వెంకట్రావు, బుజ్జి, సూర్యనారాయణ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 05:06 AM