వయస్సు 73.. డిగ్రీలు 89
ABN , Publish Date - May 19 , 2026 | 05:45 AM
దువుకోవాలనే తపనుంటే వయసుతో సంబంధం ఉండదని నిరూపిస్తున్నారు రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి.
కొత్తగా మరో 16 కోర్సులు పూర్తి చేసిన డాక్టర్ కర్రి రామారెడ్డి
‘సెంచరీ’ చేస్తానంటున్న మానసిక వైద్యుడు
రాజమహేంద్రవరం కల్చరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): చదువుకోవాలనే తపనుంటే వయసుతో సంబంధం ఉండదని నిరూపిస్తున్నారు రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి. 73 ఏళ్ల వయసులో 16 కొత్త కోర్సులు పూర్తి చేయడంతో ఆయన ఇప్పటి వరకూ పూర్తి చేసిన డిగ్రీల సంఖ్య 89కి చేరింది. తాను ఇంతటితో ఆగబోనని, డిగ్రీల సాధనలో ‘సెంచరీ’ కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డాక్టర్ రామారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. త్వరలో మరో 16 కోర్సులు చేసి సెంచరీ మైలురాయిని అధిగమిస్తానని తెలిపారు. తాజాగా తాను పూర్తి చేసిన 16 కోర్సుల్లో.. కాన్పూర్, ఖరగ్‌పూర్ ఐఐటీల నుంచి మూడేసి, రూర్కెలా, గౌహతి ఐఐటీల నుంచి రెండేసి కోర్సులను పూర్తి చేయగా, మిగతా ఆరు కోర్సులు చెన్నై ఐఐటీ నుంచి పూర్తి చేసినట్టు తెలిపారు.