Share News

మెగా సోలార్‌ పార్కుకు 737.66 ఎకరాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:31 PM

ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ 1000 మెగా వాట్ల కర్నూలు ఆల్ర్టా మెగా సోలార్‌ పార్కును స్థాపించనుంది.

మెగా సోలార్‌ పార్కుకు 737.66 ఎకరాలు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కర్నూలు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ 1000 మెగా వాట్ల కర్నూలు ఆల్ర్టా మెగా సోలార్‌ పార్కును స్థాపించనుంది. ఈపార్కు ఏర్పాటు కోసం శకునాలకి చెందిన ఎల్‌పీ నెంబర్‌ 561, 614లో 737.66 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీవో.ఎంఎస్‌.208 కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరా మార్కెట్‌ విలువ రూ.2లక్షలుగా నిర్ధారించారు. అందులో పది శాతం అంటే రూ.20వేల చొప్పున ఏడాదికి లీజుకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈలీజు మొత్తం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పది శాతం చొప్పున పెంచుతూ వెళ్తారు. జిల్లాలో మరో భారీ సోలార్‌ పవర్‌ విద్యుత పవర్‌ రాబోతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:31 PM