ఏడుగురు కలెక్టర్లకు రెడ్‌క్రాస్ అవార్డులు
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:22 AM
ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ((ఐఆర్‌సీఎస్)తో సమన్వయం చేసుకుని జిల్లాల్లో అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఏడుగురు కలెక్టర్లకు గవర్నర్ గోల్డ్ మెడల్స్ లభించాయి.
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ (ఐఆర్‌సీఎస్)తో సమన్వయం చేసుకుని జిల్లాల్లో అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఏడుగురు కలెక్టర్లకు గవర్నర్ గోల్డ్ మెడల్స్ లభించాయి. ఐఆర్‌సీఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అవార్డులను ప్రకటించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబరు 1న జరగనున్న ఐఆర్‌సీఎస్ రాష్ట్రశాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మెడల్స్‌ను కలెక్టర్లకు ప్రదానం చేయనున్నారు. ఈ జాబితాలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, బాపట్ల కలెక్టర్ వినోద్‌కుమార్, కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ, కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్, నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి ఉన్నారు.