6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి: మంత్రి అనగాని
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:45 AM
రాష్ట్రంలో ఇప్పటివరకూ 6,688 గ్రామాల్లో 86.44 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే పూర్తి చేశామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటివరకూ 6,688 గ్రామాల్లో 86.44 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే పూర్తి చేశామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 16,816 గ్రామాలు ఉన్నాయని, భూ విస్తీర్ణం 3.17 కోట్ల ఎకరాలు ఉందన్నారు. ఇప్పటి వరకూ 6,688 గ్రామాల్లోని.. 86,44,781 ఎకరాల విస్తీర్ణంలో సర్వే పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 4,236 గ్రామాల్లో సర్వే చేస్తున్నామని, 5,892 గ్రామాల్లో సర్వే ప్రారంభించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19,93 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేశామని, మరో 14.43 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేయాల్సి ఉందన్నారు.