Share News

61 మందికి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:20 AM

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఇంటర్మీడియట్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా..

61 మందికి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు

  • కేజీబీవీల్లో ఇంటర్‌ చదివిన 14 మందికీ!

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఇంటర్మీడియట్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 61 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేయగా, వీరిలో కేజీబీవీల్లో చదివిన 14 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రూపులు, మేనేజ్‌మెంట్ల వారీగా విద్యార్థులను అవార్డులకు ఎంపిక చేశారు. వీరికి మంత్రి నారా లోకేశ్‌ త్వరలో ఈ అవార్డులు అందజేస్తారు. గతేడాది నుంచి విద్యాశాఖ షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల కార్యక్రమం అమలుచేస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి టాపర్లుగా నిలిచిన టెన్త్‌, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు ఇస్తున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 05:20 AM