25న ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డులు ప్రదానం
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:45 AM
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 25న నిర్వహించనున్న ‘ఉత్తమ ఎన్నికల విఽ దానాల అవార్డులు-2025’కు రాష్ట్రవ్యాప్తంగా 61 మం దిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.
కలెక్టర్ల నుంచి బీఎల్‌వోల వరకు 61 మంది ఎంపిక
ఓటర్ల నమోదులో అగ్ర స్థానంలో పశ్చిమ గోదావరి
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 25న నిర్వహించనున్న ‘ఉత్తమ ఎన్నికల విఽ దానాల అవార్డులు-2025’కు రాష్ట్రవ్యాప్తంగా 61 మం దిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆయా జిల్లాలకు సమాచారం పంపింది. ఓటర్ల నమోదులో విశేష ప్రతిభ కనబరిచిన పశ్చిమగోదావరి జిల్లా టాప్‌లో నిలిచింది. అత్యధిక ఓటర్ల నమోదు విభాగంలో ఈ ఒక్క జిల్లా మాత్రమే అవార్డుకు ఎంపికైంది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణికి ఎన్నికల కమిషన్ పురస్కారం ప్రదానం చేయనుంది. విశాఖపట్నం, విజయనగరం, తిరపతి, నంద్యాల, ఎన్టీఆర్ డీఈవోలు (కలెక్టర్లు)... బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఓవరాల్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ విభాగంలో తిరుపతి, నం ద్యాల, ఎన్టీఆర్ జిల్లాల డీఈవోలు, అత్యధిక ఓటర్ల మ్యాపింగ్- 2026 (ఎస్‌ఐఆర్)లో ప్రకాశం, చిత్తూరు, కాకినాడ, కృష్ణా, నెల్లూర ు డీఈవోలను అవార్డులకు ఎంపిక చేశారు. ఆయా జిల్లాలకు చెందిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్‌వోలు), అసిస్టెంట్ ఈఆర్‌వోలు(ఎంఆర్‌వోలు), ఎన్నికల సూపరింటెండెంట్లు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు కూడా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో వీటిని ప్రదానం చేస్తారు.