ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్‌లో బొమ్మ!
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:43 AM
చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ ఓ పసివాడి ప్రాణం తీసింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. కోట వీధికి చెందిన అల్తాఫ్, సానియా దంపతుల ఒక్కగానొక్క కుమారుడు..
గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి
గుత్తి, జూన్16(ఆంధ్రజ్యోతి): చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ ఓ పసివాడి ప్రాణం తీసింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. కోట వీధికి చెందిన అల్తాఫ్, సానియా దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఫర్హాన్(5)కు సాయంత్రం తల్లిదండ్రులు చిప్స్ ప్యాకెట్‌ను ఇచ్చారు. వాటిని తినే క్రమంలో ఫర్హాన్ చూసుకోకుండా అందులో ఉన్న ప్లాస్టిక్ బొమ్మను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కువడంతో ఊపిరాడక విలవిల్లాడాడు. తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.