Share News

ఏపీలో 50 వేలకోట్లతో మెమొరీ చిప్స్‌ పరిశ్రమ!

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:22 AM

రాష్ట్రానికి మెమొరీ చిప్స్‌ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన మెమొరీ చిప్స్‌ తయారీ సంస్థ ఆసక్తి చూపుతోంది.

ఏపీలో 50 వేలకోట్లతో మెమొరీ చిప్స్‌ పరిశ్రమ!

  • పెట్టుబడి పెట్టేందుకు భారతీయ కంపెనీ ఆసక్తి

  • ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు

అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మెమొరీ చిప్స్‌ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన మెమొరీ చిప్స్‌ తయారీ సంస్థ ఆసక్తి చూపుతోంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా రాష్ట్ర అధికారులు.. ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉండటంతో ఈ కంపెనీ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఒకప్పుడు ఎలకా్ట్రనిక్స్‌ పరికరాల తయారీ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్‌తో పోటీ పడ్డ ఈ ఇండియన్‌ కంపెనీ ఇప్పుడు మెమొరీ చిప్స్‌ తయారీపై దృష్టి సారించింది. మెమొరీ చిప్స్‌ తయారీలో ప్రస్తుతం హాంకాంగ్‌ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో మెమొరీ చిప్స్‌ తయారీ సంస్థ తమ ఉత్పత్తులను ప్రారంభిస్తే క్రమంగా ఈ రంగంలోనూ పెట్టుబడులు పెరుగుతాయని ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన ఓ అధికారి వెల్లడించారు. ఈ సంస్థ రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అదేవిధంగా మరో కంపెనీ కూడా రూ.4000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Updated Date - Jun 27 , 2026 | 05:22 AM