50 మంది స్పెషల్ డిప్యూటీ/డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:10 AM
రాష్ట్రంలోని 50 మంది స్పెషల్ డిప్యూటీ కలెకర్టు/డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ మంగళవారం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 50 మంది స్పెషల్ డిప్యూటీ కలెకర్టు/డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ మంగళవారం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.బాపిరెడ్డిని ఏపీసీఆర్‌డీఏకు బదిలీ చేశారు. కడప జిల్లా ముద్దనూరు జీఎన్‌ఎస్ఎస్ యూనిట్-2లో పనిచేస్తున్న బీకే వెంకటేశ్వర్లును శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా నియమించారు. సింహాచలం ఎస్‌వీఎల్‌ఎన్‌ఎ్‌స దేవస్థానాల ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.గీతాంజలిని ఏపీ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ల్యాండ్స్)గా నియమించారు. పులిచింతల స్పెషల్ కలెక్టర్ పీఓగా ఉన్న ఆర్.రమే్‌షబాబును పాఠశాల విద్యాశాఖకు చెందిన ఎన్టీఆర్ జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా నియమించారు. విశాఖపట్నం హౌసింగ్ పీడీగా ఉన్న సీహెచ్.సత్తిబాబును విజయనగరం డీఆర్వోగా నియమించారు. చిత్తూరు డిజాస్టర్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ జిల్లా మేనేజర్ ఎం.అనుపమను నగరి ఆర్డీఓగా బదిలీ చేశారు. పీవీపీ మన్యంలో డీఆర్‌డీఏ పీడీగా ఉన్న సుధారాణి మాలతిని చీపురుపల్లి ఆర్డీఓగా నియమించారు.