ఆస్తి పన్ను చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:33 AM
రాష్ట్రంలో పట్టణ స్థానికసంస్థల్లో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను చెల్లిస్తే, దాని వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణ స్థానికసంస్థల్లో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను చెల్లిస్తే, దాని వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రయోజనం పొందాలంటే యజమానులు బకాయి పడ్డ ఆస్తి పన్నును నూరు శాతం చెల్లించడంతోపాటు, దానిపై ఉన్న వడ్డీలో 50 శాతం ఒకేసారి చెల్లించాలి. ఈ నెలాఖరు లోపు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికే పూర్తిస్థాయిలో వడ్డీ చెల్లించి ఉంటే దాన్ని తిరిగి చెల్లించబోమని, భవిష్యత్తు డిమాండ్‌కు సర్దుబాటు చేస్తామని మున్సిపల్‌శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.