Share News

తీరనున్న మంత్రాలయం ప్రజల దాహార్తి

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:05 AM

కర్నూలు జిల్లా మంత్రాలయంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడింది. గోశాల సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో..

తీరనున్న మంత్రాలయం ప్రజల దాహార్తి

  • రూ.50 కోట్లతో జలాశయం నిర్మాణానికి హెచ్‌ఏఎల్‌ అంగీకారం

మంత్రాలయం, జూలై 4(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా మంత్రాలయంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడింది. గోశాల సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో జలాశయం నిర్మించేందుకు హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ముందుకు వచ్చింది. హెచ్‌ఏఎల్‌ అధికారులు శనివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. శ్రీమఠం అధికారులతో జలాశయం నిర్మాణ ప్రణాళిక, ఖర్చు, నీటి నిల్వ, శుద్ధి, సరఫరా అంశాలపై చర్చించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) కింద జలాశయం నిర్మించి, తుంగభద్ర నది నుంచి నీటిని తరలిస్తారు. 6 నెలలకు సరిపడా తాగునీరు నిల్వ ఉండే విధంగా నిర్మాణం చేపడతారు. అక్కడే శుద్ధి చేసి మంత్రాలయంతో పాటు ఇతర గ్రామాలకు ఆ నీటిని అందిస్తారు.

Updated Date - Jul 05 , 2026 | 05:06 AM