Share News

సీజీహెచ్‌ఎస్‌ వైద్యం కోసం రాష్ట్రంలో 46 ఆసుపత్రులు

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:06 AM

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) కింద ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్‌ చెప్పారు.

సీజీహెచ్‌ఎస్‌ వైద్యం కోసం రాష్ట్రంలో 46 ఆసుపత్రులు

న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) కింద ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్‌ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 46 హెల్త్‌ కేర్‌ ఆర్గనైజేషన్స్‌ ఆస్పత్రులను ఎంప్యానెల్‌ చేసినట్లు తెలిపారు. శుక్రవారం, లోక్‌సభలో టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విశాఖపట్నంలో అత్యధికంగా 20, ఎన్టీఆర్‌ జిల్లాలో 11 ఆస్పత్రులు ఎంప్యానెల్‌ అయ్యాయని చెప్పారు.

Updated Date - Jul 25 , 2026 | 05:09 AM