Tirumala: ఆరు రోజుల్లో 4.59 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:01 AM
గడిచిన ఆరురోజుల్లో 4.59 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు చేసుకున్నారు.
హుండీ ద్వారా రూ.24.61 కోట్ల కానుకలు
తిరుమల, జనవరి5(ఆంధ్రజ్యోతి): గడిచిన ఆరురోజుల్లో 4.59 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు చేసుకున్నారు. డిసెంబరు 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు మొదలైన విషయం తెలిసిందే. 30న 67,053 మంది, 31న 70,256, జనవరి1న 65,225, 2న 83,032, 3న 88,662, 4న 85,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేశారు. గత ఏడాది వైకుంఠద్వార దర్శనాల్లో తొలి ఆరు రోజుల్లో 4.07 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది 52 వేల మంది అదనంగా దర్శనం చేసుకున్నారు. ఇక, ఈ ఆరు రోజుల్లో రూ.24.61 కోట్ల హుండీ ఆదాయం లభించగా, 1.43 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. జనవరి 8 అర్థరాత్రి వరకు వైకుంఠద్వార దర్శనాలు ఉంటాయి.