సిక్కోలులో మహానాడు!
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:55 AM
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు వేదిక ఖరారైంది. 44వ మహానాడును సిక్కోలులో నిర్వహించాలని నిర్ణయించారు.
మే 27, 28, 29లలో చాపురంలో నిర్వహణ
చివరిరోజు 5 లక్షల మందితో బహిరంగ సభ
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు వేదిక ఖరారైంది. 44వ మహానాడును సిక్కోలులో నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా చాపురంలో మే 27, 28, 29న ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులతో బుధవారం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయి దంత కళాశాల పక్కనే సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. తొలి రెండు రోజులు ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉండదని, చివరి రోజు సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని నేతలు లోకేశ్ దృష్టికి తెచ్చారు.