Share News

హెచ్‌ఐవీతో ఐదేళ్లలో 44 వేల మంది మృతి

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:00 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది హెచ్‌ఐవీ బాధితులు మరణించారని కేంద్రం తెలపింది.

హెచ్‌ఐవీతో ఐదేళ్లలో 44 వేల మంది మృతి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది హెచ్‌ఐవీ బాధితులు మరణించారని కేంద్రం తెలపింది. మంగళవారం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్‌ రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంంది హెచ్‌ఐవీ బాధితులు మరణించారని, ఇదే కాలంలో దేశవ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు మరణించారని తెలిపారు.

Updated Date - Feb 04 , 2026 | 06:00 AM