తిరుమల అన్నప్రసాదానికి భాష్యం రూ.44 లక్షలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:06 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు.
సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా విరాళం అందజేత
గుంటూరు(విద్య)/తిరుమల, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. ఆయనకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సోమవారం చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక రోజు అన్నదానం నిమిత్తం రూ.44 లక్షల విరాళాన్ని ఆదివారం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(అన్నదానం) ఎం.రాజేంద్ర కుమార్‌కు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు గ్రేట్ విజనరీ అని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.