ఓటర్ల వివరాల సేకరణకు వీలుకాని ఎన్యుమరేషన్ ఫారాలు 43.62 లక్షలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:19 AM
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా మొత్తం 43,62,387 మంది ఓటర్ ఎన్యుమరేషన్..
గడువు పొడిగింపుతో తప్పులు సరిచేస్తున్న బీఎల్‌ఓలు
అమరావతి, జూలై 18(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా మొత్తం 43,62,387 మంది ఓటర్ ఎన్యుమరేషన్ పత్రాలను(వీఈఎఫ్) ఓటర్ల వివరాలు సేకరించడానికి వీలు కానివి(అన్‌కలెక్టబుల్)గా డిజిటలైజ్ చేశారు. అవి 11 జిల్లాల్లో 11 శాతంపైగా ఉన్నాయి. వాటిలోనే మరణించిన, పూర్తి స్థాయిలో మరో ప్రాంతానికి మారిన, అన్ ట్రేసబుల్, ఆబ్‌సెంట్ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు ఉన్నాయి. తొలుత ఈ నెల 14 తేదీ వరకు మాత్రమే వీఈఎఫ్‌ల స్వీకరణ, డిజిటలైజేషన్ గడువును ఎన్నికల సంఘం నిర్ణయించడంతో వాటిని బీఎల్‌వోలు హడావుడిగా డిజిటలైజేషన్ చేశారు. దీంతో డిజిటలైజ్ చేసిన ఫారాల్లో పలు తప్పులు దొర్లాయి. వీటితోపాటు 2002 ఓటర్ల జాబితాతో, ప్రస్తుత జాబితాలో ఓటర్ల పేర్లు, వారి బంధువులకు సంబంధించిన వివరాల నమోదులో పలు చోట్ల రాంగ్ మ్యాపింగ్ చేశారు. ఈసీ గడువును 24 వరకు పొడిగించడంతో బీఎల్‌వోలు గతంలో వీఈఎ్‌ఫల స్వీకరణ, డిజిటలైజేషన్‌లో దొర్లిన తప్పులను సరి చేసే పనిలో పడ్డారు.