Share News

జోగి ఇంటిపై దాడి ఘటనలో 40 మందిపై కేసులు

ABN , Publish Date - Feb 03 , 2026 | 04:02 AM

మాజీమంత్రి జోగి రమేశ్‌ ఇంటిపై దాడి కేసులో పోలీసులు మొత్తం 40 మంది టీడీపీ నాయకు లు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. వారిలో 12 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

జోగి ఇంటిపై దాడి ఘటనలో 40 మందిపై కేసులు

  • ఇప్పటివరకు 12 మంది అరెస్టు..

  • స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

విజయవాడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : మాజీమంత్రి జోగి రమేశ్‌ ఇంటిపై దాడి కేసులో పోలీసులు మొత్తం 40 మంది టీడీపీ నాయకు లు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. వారిలో 12 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం వారిని స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. మరోపక్క జోగి రమేశ్‌ కార్యాలయంలో పనిచేసే మూలపాడు రాంబాబు అనే వ్యక్తి ఈ దాడిపై మరో ఫిర్యాదు చేశారు. 250 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 04:02 AM