ఆర్టీసీకి 200 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:58 AM
ఏపీఎ్‌సఆర్టీసీ ప్రస్తుతం గాడిలో పడిందని, టికెట్ ఆదాయం మాత్రమే కాకుండా కార్గో సర్వీసుల ద్వారా సంస్థ సుమారు రూ. 200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
స్త్రీశక్తి ద్వారా 40 కోట్ల మంది ప్రయాణం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌సఆర్టీసీ ప్రస్తుతం గాడిలో పడిందని, టికెట్ ఆదాయం మాత్రమే కాకుండా కార్గో సర్వీసుల ద్వారా సంస్థ సుమారు రూ. 200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్ర్తీ శక్తి పథకం కింద ఇప్పటివరకు 40 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని చెప్పారు. ఆర్టీసీ రాష్ట్రవ్యాప్త డీపీటీఓల సమీక్షా సమావేశం బుధవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు వచ్చిన ఆదాయ, వ్యయాలు ఇతర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్లీ అన్‌ఫిట్ ఉద్యోగుల విషయంలో ఇప్పటి వరకు 51 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించామని, 149 మందికి ఆర్థిక సహాయం అందించామన్నారు.