11, 12 తేదీల్లో విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:36 AM
తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలను ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడలోని..
విజయవాడ కల్చరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలను ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తు న్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే, మహాసభల గౌరవాధ్య క్షుడు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ, విదేశాల నుంచి ప్రముఖ రచయిత్రులు, కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్ధిపై చర్చిస్తారని తెలిపారు. నాలుగు వేదికలపై సుమారు 50 గ్రంథాల ఆవిష్కరణ, 24 సదస్సులు, 15 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నట్టు చెప్పారు. అలాగే 500 మందికిపైగా తెలుగు సాహితీమణులకు సత్కా రాలు, యువ రచయితలకు ప్రోత్సాహక కార్యక్ర మాలు కూడా ఉంటాయని వివరించారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ తూనుగుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, సభా ప్రాంగణానికి ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి పేరు పెట్టిన ట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన 50 మంది సీనియర్ రచయిత్రులకు ‘విదుషీమణి’ పురస్కా రాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మహాసభల అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి డాక్టర్ జి.వి. పూర్ణచంద్, ప్రముఖ సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.