Share News

అసెంబ్లీ సిబ్బందికి 3 రోజులు శిక్షణ తరగతులు

ABN , Publish Date - May 19 , 2026 | 06:24 AM

శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసనవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

అసెంబ్లీ సిబ్బందికి 3 రోజులు శిక్షణ తరగతులు

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసనవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి మొదలయ్యే కార్యక్రమాలను పార్లమెంటరీ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ్‌స(ప్రైడ్‌) సహకారంతో నిర్వహిస్తున్నారు. తరగతుల్లో చట్టాల రూపకల్పన, ప్రైవేటు సభ్యుల బిల్లు లు, తీర్మానాలు, జీరో అవర్‌, ప్రశ్నోత్తరాలు, శాసనవ్యవస్థలో బడ్జెట్‌ ప్రక్రి యలపై శిక్షణ ఇస్తారు. వీటిని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్న కుమా ర్‌ సూర్యదేవర ప్రారంభిస్తారు. లోక్‌సభా సచివాలయం ప్రైడ్‌ డైరెక్టర్‌ పీకే మల్లిక్‌, సంయుక్త కార్యదర్శులు హెచ్‌ రామ్‌ప్రకాశ్‌, ఎంకే శర్మ, పార్థ గోస్వామి తదితరులు సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

Updated Date - May 19 , 2026 | 06:25 AM