విధుల్లో చేరిన 377 మంది వైద్యులు
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:36 AM
రాష్ట్రంలో కొత్తగా 377 మంది వైద్యులు సోమవారం విధుల్లో చేరారు. వారిలో 61.54 శాతం అంటే 232 మంది మహిళా వైద్యులు ఉన్నారు.
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 377 మంది వైద్యులు సోమవారం విధుల్లో చేరారు. వారిలో 61.54 శాతం అంటే 232 మంది మహిళా వైద్యులు ఉన్నారు. పోస్టింగులు పొందిన వారిలో పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లుగా 282 మంది, బోధనాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా 95 మంది విధుల్లో చేరారు. మొత్తంగా 611 పోస్టులను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించగా 482 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు. వారందరికీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. కొత్తగా విధుల్లో చేరిన వైద్యులందరికీ మంత్రి సత్యకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.