కారును అడ్డగించి.. రూ.3.70 కోట్లు కొట్టేశారు!
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:18 AM
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద దారి దోపిడీ జరిగింది. విశ్వసనీయ సమాచా రం మేరకు 44వ నంబరు జాతీయ రహదారిపై...
బాధితుడు గుజరాతీ పండ్ల వ్యాపారి
ఆలస్యంగా వెలుగులోకి!
కనగానపల్లి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద దారి దోపిడీ జరిగింది. విశ్వసనీయ సమాచా రం మేరకు 44వ నంబరు జాతీయ రహదారిపై వారం రోజుల కిందట రూ.3.70 కోట్ల నగదును దొంగలు దోచుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ పండ్ల వ్యాపారి కారులో డ్రైవర్‌తో కలసి వారాణసి నుంచి బెంగళూరు వైపు వెళుతుండగా ఈ దోపిడీ జరిగింది. దొంగలు మూడు వాహనాల్లో వ్యాపారి కారును వెంబడించారు. మామిళ్లపల్లి వద్ద కారును అడ్డగించి, వ్యాపారిని, డ్రైవర్‌ను బెదిరించి, కారులో ఉన్న నగదు దోచుకున్నారు. వ్యాపారిని, డ్రైవర్‌ను అదే కారులో తీసుకువెళ్లి.. వేర్వేరు ప్రాంతాల్లో దిం చేశారు. ఆ తర్వాత కారును మరోచోట వదిలేసి పారిపోయారు. అదే రోజు సాయంత్రం బాధితుడు కనగానపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొం గల కోసం పోలీసు అధికారులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. హైవేపే భారీ గా నగదు దోపిడీ జరగడంతో ఈ కేసును పోలీసు లు సవాలుగా తీసుకున్నారు. టోల్‌ప్లాజా, జంక్షన్ల వద్ద సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగలు తమిళనాడుకు చెందినవారిగా అనుమానిస్తున్నారు.