Share News

డ్రోన హబ్‌కు 369 ఎకరాలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:13 AM

ఓర్వకల్లులో 369.95 ఎకరాలు స్థలంలో డ్రోన హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజు వెల్లడించారు.

    డ్రోన హబ్‌కు 369 ఎకరాలు
చింతలపల్లెలో డ్రోన హబ్‌ పై మ్యాప్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజు, కలెక్టర్‌ డా.సిరి

స్థలాలను పరిశీలించిన ఏపీఐఐసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజు, కలెక్టర్‌ డా. సిరి

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లులో 369.95 ఎకరాలు స్థలంలో డ్రోన హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజు వెల్లడించారు. ఓర్వకల్లు ప్రాంతాన్ని డ్రోన హబ్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కేబినెట్‌ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం చింతలపల్లె, పాలకొలను, కొమరోలు పొలిమేరలోని 484 ఏ సర్వే నెంబరులో 369.95 ఎకరాలు డ్రోన హబ్‌కు కేటాయించారు. ఈ స్థలాలను ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజుతో పాటు కలెక్టర్‌ డా.ఏ. సిరి, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, జోనల్‌ మేనేజర్‌ మధుసూదన రెడ్డి పరిశీలించారు. చింతలపల్లె, పాలకొలను, కొమరోలు భూములు డ్రోన హబ్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో 369.95 ఎకరాలు కేటాయించామన్నారు. దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడితో డ్రోన పాలసీ 2024-2029 ఏపీ డ్రోన కార్పొరేషన రూపొందించిందన్నారు. డ్రోన రంగంలో 40వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఇప్పటికే డ్రోన హబ్‌ ప్రాంతంలో రూ.22 కోట్లతో రోడ్లు వేసినట్లు తెలిపారు. చింతలపల్లె గ్రామ రైతులు తమ భూములు ఏపీఐఐసీలో పోయాయని, తమకు నష్టపరిహారం ఇవ్వలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దానికి కలెక్టర్‌ స్పందించి వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవో తహసీల్దార్‌లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చెన్నై ప్లానింగ్‌ అధికారి శ్రీధర్‌, ఆర్డీవ సందీప్‌ కుమార్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, సీఈ కేవీవీపీ ప్రసాద్‌, డీఈ ఉదయ్‌, సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:13 AM