Godavari Pushkaralu: పుష్కరాలకు 359 స్నాన ఘట్టాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:33 AM
గోదావరి పుష్కర పనులపై యంత్రాంగం దృష్టి సారించింది. 2027లో జరగనున్న పుష్కరాలకు సంబంధించి మొత్తం 359 స్నానఘట్టాలు సిద్ధం చేయడానికి...
రూ. 445.44 కోట్లతో ప్రతిపాదనలు కొత్తగా 125 ఘాట్ల నిర్మాణం
రాజమహేంద్రవరం, జనవరి18(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కర పనులపై యంత్రాంగం దృష్టి సారించింది. 2027లో జరగనున్న పుష్కరాలకు సంబంధించి మొత్తం 359 స్నానఘట్టాలు సిద్ధం చేయడానికి రూ.445.44 కోట్లతో ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల పరిధిలో స్నాన ఘట్టాలు నిర్మించనున్నారు. ఇప్పటికే పాత ఘాట్లు 234 ఉన్నాయి. వాటిలో 69 ఘాట్ల విస్తరణకు నిర్ణయించారు. కొత్తగా రూ.127.46 కోట్లతో 125 స్నాన ఘట్టాలు నిర్మించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా రూ.29.75 కోట్లతో 29 ఘాట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.11.58 కోట్లతో 8 ఘాట్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.68.63 కోట్లతో 70 ఘాట్ల్లు, కాకినాడ జిల్లాలో రూ.1.8 కోట్లతో 2 ఘాట్లు , ఏలూరు జిల్లాలో రూ.16.41 కోట్లతో 16 ఘాట్లు నిర్మించనున్నారు. కాగా, పాతఘాట్లు మొత్తం 234 ఉండగా వాటి మరమ్మతులకు రూ.176.88 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.