Share News

Minister BC Janardhan Reddy: రూ.3,380 కోట్లతో రహదారుల అభివృద్ధి

ABN , Publish Date - Jan 11 , 2026 | 04:46 AM

రాష్ట్రంలో ప్రస్తుతం రూ.3,380కోట్లతో రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు.

Minister BC Janardhan Reddy: రూ.3,380 కోట్లతో రహదారుల అభివృద్ధి

  • మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కాళ్ళ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం రూ.3,380కోట్లతో రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్‌ అండ్‌ బీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె వద్ద బొండాడ డ్రెయిన్‌పై రూ.12కోట్లతో నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి శనివారం డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజులతో కలిసి భూమి పూజ చేశారు. అంతకు ముందు డ్రెయిన్‌పై శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు.

Updated Date - Jan 11 , 2026 | 04:46 AM