తాబేళ్ల అక్రమ రవాణా గుట్టురట్టు
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:59 AM
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో...
కిర్లంపూడి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో 18 గోనె సంచుల్లో 320 తాబేళ్లు మూట గట్టి ఉండటాన్ని గుర్తించారు. కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ బెంగాల్‌కు అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుసుకుని ఏలేశ్వరం అటవీ శాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను ప్రత్తిపాడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. స్వాధీనం చేసుకున్న 320 తాబేళ్లను ఏలేరు జలాశయంలో విడిచిపెట్టారు.