తాడిపత్రిలో 30 అడుగుల వాసవీమాత విగ్రహం
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:49 AM
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిలో వాసవీ మాత 30 అడుగుల విగ్రహాన్ని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ప్రారంభించారు.
కడప రోడ్డులో ఆవిష్కరించిన మంత్రి టీజీ భరత్
తాడిపత్రి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిలో వాసవీ మాత 30 అడుగుల విగ్రహాన్ని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తాడిపత్రిలో వాసవీమాత భారీ విగ్రహాన్ని సర్కిల్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని మంత్రి భరత్ అన్నారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సహాయ సహకారాలు అందించడంవల్లే వాసవీమాత విగ్రహం ఏర్పాటు చేయగలిగామని అన్నారు. ఆర్యవైశ్యులతో జేసీ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఆర్యవైశ్యులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఆర్యవైశ్యులు వ్యాపారాల్లోనే కాదు, రాజకీయ రంగంలోనూ రాణించాలన్నారు.