Share News

ప్రైవేట్‌ స్కూళ్లలో 30 వేల మందికి సీట్లు

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:12 AM

విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) కింద రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో తొలి విడత 30,075 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్టు...

ప్రైవేట్‌ స్కూళ్లలో 30 వేల మందికి సీట్లు

  • సమగ్ర శిక్ష అధికారి వెల్లడి

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) కింద రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో తొలి విడత 30,075 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్టు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకుడు బి.శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి లాటరీ ద్వారా సీట్లు పొందిన వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వివరాలకు టోల్‌ ఫ్రీ నెంబరు 18004258599లో సంప్రదించవచ్చునని తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 03:12 AM