ఉద్యోగినులకు వరం
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:15 AM
రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగినులకు సురక్షిత వసతి కల్పించేందుకు కొత్తగా 30 ‘సఖి నివాస్’లు(వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో కొత్తగా 30 సఖి నివాస్‌లు
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగినులకు సురక్షిత వసతి కల్పించేందుకు కొత్తగా 30 ‘సఖి నివాస్’లు(వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో వసతి గృహంలో 30మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్కో సఖి నివా్‌సకు మేనేజర్, వార్డెన్, కేర్ టేకర్లు 3, సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు పోస్టులు 3 చొప్పున మొత్తం 8 పోస్టులకు నెలకు రూ.84000, సంవత్సరానికి రూ.10.08 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిలో ఉద్యోగినుల పిల్లలు/శిశువులను సురక్షితంగా ఉంచేలా క్రెచ్ కూడా అందుబాటులో ఉంచనున్నారు.