రూ.3కోట్ల పనులు.. 3 నెలల్లో పూర్తి
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:05 AM
జనం కోరుకున్న రూ.3కోట్ల విలువైన అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ నరసింహప్రసాద్ హామీ ఇచ్చారు.
అక్షరం అండగా..పరిష్కారమే అజెండాగా..
‘అక్షరం అండగా...’ సదస్సులో ఎమ్మెల్యే, కమిషనర్ హామీ
న్యూట్రిన్ ఫ్యాక్టరీలో అవకాశం కల్పిస్తానన్న ఎమ్మెల్యే
చిత్తూరు అర్బన్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): జనం కోరుకున్న రూ.3కోట్ల విలువైన అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ నరసింహప్రసాద్ హామీ ఇచ్చారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని జానకారపల్లెలో సోమవారం నిర్వహించిన ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. వీధి లైట్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయాలని వచ్చిన వినతులపై ఎమ్మెల్యే, కమిషనర్ అక్కడికక్కడే స్పందించి, పరిష్కారానికి ఆదేశించారు. దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు (మధ్యలో జానకారపల్లె) రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు, మెయిన్ డ్రైన్లు, రోడ్డు మధ్యలో డివైడర్లతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు రూ. 2.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మరో రూ.50 లక్షలతో జానకారపల్లెలో మురికి కాల్వల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. చుడా ఆధ్వర్యంలో వార్డు పరిధిలో అభివృద్ధి పనులకు రూ.20 లక్షలను మంజూ రు చేస్తానని చైర్‌పర్సన్ కఠారి హేమలత తెలిపారు. సదస్సుకు హాజరైన జనం.. ఉపాధి సమస్యలను ప్రస్తావించారు. కోరారు. మూతబడ్డ న్యూట్రిన్ ఫ్యాక్టరీని కొన్నానని, అక్కడ మాల్స్ నిర్మాణం పూర్తయితే 80 శాతం స్థానికులకే ఉపాఽధి అవకాశాలను కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్ సురేశ్ రెడ్డి సదస్సును విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.