‘గ్రీనకో’ ప్రాజెక్టుకు 290.023 ఎకరాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:32 PM
ఇటీవల క్యాబినేట్‌లో ఆమోదం పొందిన ప్రకారం గ్రీనకో ఏపీ01 ఐఆర్‌ఈపీ ప్రైవేట్ లిమిటెడ్‌కు(500ఎండబ్ల్యూ ఇంటి గ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు) జిల్లాలోని మిడ్తూరు మండలంలో 290.023 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగిస్తూ ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ సాయి ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నంద్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఇటీవల క్యాబినేట్‌లో ఆమోదం పొందిన ప్రకారం గ్రీనకో ఏపీ01 ఐఆర్‌ఈపీ ప్రైవేట్ లిమిటెడ్‌కు(500ఎండబ్ల్యూ ఇంటి గ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు) జిల్లాలోని మిడ్తూరు మండలంలో 290.023 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగిస్తూ ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ సాయి ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలం నాగలూటి గ్రామంలోని సర్వే నెంబర్లు ఎల్‌పీఎం నెంబర్లులోని 316,297,283,(ఓల్డ్ సర్వే నెంబర్లు 177) పరిధిలోని 252.311 ఎకరాలు, మాసపేటలోని ఎల్‌పీఎం నెంబర్ 8లోని(ఓల్డ్ సర్వే నెంబర్ 193లోని) 37.712 ఎకరాలు మొత్తం కలిపి 290.023 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి ఎకరాకు రాయితీపై రూ.5లక్షలు చొప్పున గ్రీనకో సంస్థ చెల్లించనుంది.