29 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఖాళీ
ABN , Publish Date - May 05 , 2026 | 05:00 AM
రెవెన్యూ శాఖ పరిధిలో 2025-26 అడహక్ ప్యానెల్ సంవత్సరానికి 29 డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు ఏర్పడ్డాయి.
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ పరిధిలో 2025-26 అడహక్ ప్యానెల్ సంవత్సరానికి 29 డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈమేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్ జీఓ 660 ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇందులో రిటైర్‌మెంట్ ద్వారా 25 ఖాళీలు ఏర్పడ్డాయి. మరో మూడు పోస్టులను రిజర్వ్‌చేయగా, ఒకటి స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఖాళీ ఏర్పడిందని ఉత్తర్వులో పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్‌గా పదోన్నతులు ఇచ్చే ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది. ఇది పూర్తికాగానే తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ (డీసీ)లుగా పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఖాళీల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏను ప్రభుత్వం ఆదేశించింది.