Share News

రేపల్లెలో 27 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:44 AM

బాపట్ల జిల్లా రేపల్లెలో సోమవారం పేట్రేగిపోయిన వైసీపీ అల్లరిమూక ల వ్యవహారంలో 27 మందిపై కేసు నమోదు చేశారు.

రేపల్లెలో 27 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

ఇంటర్నెట్ డెస్క్: బాపట్ల జిల్లా రేపల్లెలో సోమవారం పేట్రేగిపోయిన వైసీపీ అల్లరిమూక ల వ్యవహారంలో 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈనెల 14న రేపల్లె వైసీపీ చాన్‌చార్జిగా పీటా నాగమోహనకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. దీనిపై సోమవారం అనుచరులను వెంటేసుకుని పీటా నాగమోహనకృష్ణ పట్టణంలో హల్‌చల్‌ చేశారు. రప్పారప్పా నినాదాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై టీడీపీ నాయకుడు సూర్యరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీటా సహా 27 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 04:45 AM