258 గ్రామాల్లో భూగర్భజలాల అధిక వినియోగం
ABN , Publish Date - May 11 , 2026 | 04:50 AM
రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని 258 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
వాల్టా చట్టం అమలు చేస్తూ ఆదేశాలు
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని 258 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. కేంద్రస్థాయి నిపుణుల బృందం, రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించిన నివేదిక ఆధారంగా అనంతపురంలో 14 గ్రామాలు, చిత్తూరులో 8, పల్నాడులో 20, ప్రకాశంలో 91, సత్యసాయిలో 39, శ్రీకాకుళంలో 76, కడప జిల్లాలో 10 గ్రామాలును ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్లు చట్టం-2002(వాల్టా) కింద గుర్తించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాల్టా చట్టం ప్రకారం ఈ గ్రామాల్లో తాగునీరుకు చేతి పంపులు తప్ప ఎలాంటి బోర్లు తవ్వరాదని ఆదేశాలిచ్చారు.