Share News

రోజంతా స్పీడ్‌ పోస్ట్‌ బుకింగ్‌ సేవలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:36 AM

ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కార్యకలాపాల వేగాన్ని పెంచుతూ పోస్టల్‌ శాఖ నిర్ణయం తీసుకుంది.

రోజంతా స్పీడ్‌ పోస్ట్‌ బుకింగ్‌ సేవలు

విజయవాడ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కార్యకలాపాల వేగాన్ని పెంచుతూ పోస్టల్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో 24 గంటలపాటు స్పీడ్‌ పోస్ట్‌, పార్శిల్‌ బుకింగ్‌ సేవలను అందించేందుకు సిద్ధమైంది. మరో 242 పట్టణాల్లోని సబ్‌ పోస్ట్‌ ఆఫీసుల పని వేళలను రెండు గంటలు పెంచింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, కడప, అనంతపురం, ఒంగోలు, గుంతకల్‌ నగరాల్లోని ప్రజలకు జనరల్‌ పోస్ట్‌ ఆఫీ్‌స(జీపీవో)ల్లో స్పీడ్‌ పోస్ట్‌, పార్శిల్‌ బుకింగ్‌లను 24 గంటలపాటు చేసుకునే అవకాశం కల్పించింది. ఐటీ 2.0 సాప్ట్‌వేర్‌ను జీపీవో, సబ్‌ పోస్ట్‌ ఆఫీసులకు అనుసంధానం చేసిన తరువాత పోస్టల్‌ సేవలు మరింత స్మార్ట్‌గా మారడంతో కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Updated Date - Feb 25 , 2026 | 03:56 AM