240 చోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:05 AM
నెల్లూరురూరల్ నియోజకవర్గంలో ఏకకాలంలో 240చోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం కూటమి నాయకులు ప్రారంభోత్సవం చేశారు.
నెల్లూరు రూరల్‌లో ఏకకాలంలో ప్రారంభించిన కూటమి నేతలు
నెల్లూరురూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నెల్లూరురూరల్ నియోజకవర్గంలో ఏకకాలంలో 240చోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం కూటమి నాయకులు ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు పరిధిలోని పడారుపల్లి వద్ద సీసీరోడ్లు, డ్రెయిన్లకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేయర్ సుజాత ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల వద్దనున్న పారిశ్రామిక వాడకు త్వరలో ఓ పరిశ్రమ రాబోతున్నట్టు ఈసందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ అజయ్‌కుమార్, నెల్లూరు నగర మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, జనసేన నాయకులు సుజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే రూరల్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, స్థానికుల నేతృత్వంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు వేడుకగా జరిగాయి.