రాష్ట్రంలో 19.07 లక్షల పీఎంఏవై ఇళ్లకు ఆమోదం
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:49 AM
పీఎంఏవై-యూ కింద ఏపీలో ఇప్పటివరకు 19.07 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పీఎంఏవై-యూ కింద ఏపీలో ఇప్పటివరకు 19.07 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వీటిలో 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, 10.75 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని లోక్‌సభలో టీడీపీ ఎంపీ జీఎం హరీశ్ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహు గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.