Share News

ఐటీడీఏ పీవో బంగ్లాలో 18 అడుగుల కింగ్‌కోబ్రా

ABN , Publish Date - May 17 , 2026 | 04:45 AM

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీవో బంగ్లాలో 18 అడుగుల కింగ్‌ కోబ్రా పాము శుక్రవారం అర్థరాత్రి ఆందోళనకు గురి చేసింది.

ఐటీడీఏ పీవో బంగ్లాలో 18 అడుగుల కింగ్‌కోబ్రా

సీతంపేట రూరల్‌, మే 16(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీవో బంగ్లాలో 18 అడుగుల కింగ్‌ కోబ్రా పాము శుక్రవారం అర్థరాత్రి ఆందోళనకు గురి చేసింది. పీవో బంగ్లాలోని సీసీ గదిలో ఉన్న కింగ్‌కోబ్రాను చూసి శనివారం విధులకు వచ్చిన బంగ్లా సిబ్బంది భీతిల్లారు. గదిలోని బీరువాకు కింగ్‌ కోబ్రా చుట్టుకొని ఉండడంతో.. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సమాచారం మేరకు కొత్తూరు ఎఫ్‌ఎస్‌వో కృష్ణ, ఎఫ్‌బీవో సంతోష్‌ ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ సిబ్బంది బంగ్లాకు చేరుకొని కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Updated Date - May 17 , 2026 | 04:49 AM